background cover of music playing
Ranga Ranga - S. P. Balasubrahmanyam

Ranga Ranga

S. P. Balasubrahmanyam

00:00

04:10

Song Introduction

ప్రస్తుతం ఈ పాట గురించి సమాచారమేమీ లభించలేదు.

Similar recommendations

Lyric

రంగ రంగ వైభవంగ నా పెళ్ళట

ఊరు వాడ ఆరగించ పెళ్ళి విందట

ఎంతసేపట లొట్టలేయుట

ఇంక నాకు వల్ల కాదు పస్తులుండుట

రంగ రంగ వైభవంగ నా పెళ్ళట

ఊరు వాడ ఆరగించ పెళ్ళి విందట

ఎంతసేపట లొట్టలేయుట

ఇంక నాకు వల్ల కాదు పస్తులుండుట

స్పూనులెందుకోయ్ tomato సూపు తాగగ

గిన్నె ఎత్తి పెట్టి ఒక్క గుటక వెయ్యక

ఉన్నదెంట ఇదంతా వందమందికా

వంతులొద్దు ఊడ్చిపెట్టు మిగలనీయక

ఆవురావురంటూ ఉన్న పేగు అవసరాని తీర్చి

బ్రేవ్ మంటూ తేంచుతుంటే ఎంత హాయట

రంగ రంగ వైభవంగ నా పెళ్ళట

ఊరు వాడ ఆరగించ పెళ్ళి విందట

ఎంతసేపట లొట్టలేయుట

ఇంక నాకు వల్ల కాదు పస్తులుండుట

బూర్ల బుట్టలో పడాలి వెర్రి ఊపుతో

కూరలన్నీ మాయమంట ఒక్క చూపుతో

ఆ ఆవకాయతో మసాల అప్పడాలతో

ముద్దపప్పు కలిపి కొడితే జై అన్నపూర్ణ!

వెనక జన్మ ఆకలంతా గురుతు తెచ్చు భోజనాన్ని

చూస్తూ చూస్తూ వదిలిపెడితే ఎంత తప్పట

రంగ రంగ వైభవంగ నా పెళ్ళట

ఊరు వాడ ఆరగించ పెళ్ళి విందట

ఎంతసేపట లొట్టలేయుట

ఇంక నాకు వల్ల కాదు పస్తులుండుట

ఉలవచారులో రవ్వంత వెన్నపూస వెయ్ వెయ్

వెనక ముందు చూడకుండ ఊదిపారవోయ్ ఉఫ్

పూతరేకులు, జిలేబి, రవ్వ లడ్డులు

అబ్బ మొత్తమన్నీ పాడు పొట్టపాలు చెయ్యవోయ్

హ్మ్... హా... శెభాష్

ముందు జన్మ దాక వదిలిపెట్టనంత మత్తు వస్తే

ఉన్నచోట నడుము వాల్చి కునుకు తియ్యవోయ్

జై అన్నపూర్ణ! శెభాష్

రంగ రంగ వైభవంగ నా పెళ్ళట

ఊరు వాడ ఆరగించ పెళ్ళి విందట

ఎంతసేపట లొట్టలేయుట

ఇంక నాకు వల్ల కాదు పస్తులుండుట

- It's already the end -